తాత్కాలికంగా 18 రైళ్లు రద్దు

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు డివిజన్‎లో మరమ్మతులు, ఎలక్ట్రిఫికేషన్, మోడలింగ్ వంటి అభివృద్ధి పనుల కారణంగా తిరుపతి మార్గంలో 18 రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇందులో కొన్ని రైళ్లు వారం రోజులు, మరికొన్ని రెండు రోజులు మరమ్మతులు అవసరాన్ని బట్టి రద్దు చేశారు. రెండు రైళ్లకు హాల్టింగ్ నిలిపివేశారు. మరో ఏడు రైళ్లను రేణిగుంట తిరుపతి వెళ్లే మార్గాల్లో నిలిపివేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే యథావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

ads