మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్ `నారప్ప` యంగ్‌లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్.హైదరాబాద్ : సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటి నుంచీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన `నారప్ప` టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటివరకు ఓల్డ్ లుక్ గెటప్స్‌తో మెప్పించిన వెంకటేష్ ఈ సారి యంగ్ లుక్ లో కనిపించి ప్రేక్షకుల్నిసర్‌ప్రైజ్ చేశారు. వెంకటేష్ యంగ్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ‘నారప్ప’సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్టరీ వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కే నాయుడు
సంగీతం : మణిశర్మ
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ : గాంధీ నడికుడికర్
కథ : వెట్రిమారన్
స్క్రిప్ట్ కన్సల్టెంట్ : సత్యానంద్
ఫైట్స్ : పీటర్ హెయిన్స్ , విజయ్
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి , సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం
ఫైనాన్స్ కంట్రోలర్ : జీ రమేష్‌రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్ : రామబాలాజి డీ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పండి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ శంకర్ డొంకాడ
కో- ప్రొడ్యూసర్ : దేవి శ్రీదేవి సతీష్
నిర్మాతలు : డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను
దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల