మంత్రి సత్యవతి రాథోడ్‎కి కరోనా

హైదరాబాద్: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారిన పడ్డారు. నేడు ఉదయం ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమె హోం ఐసోలేషన్‎లో ఉంటున్నట్లు ప్రకటించారు. గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్‎కి సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి సత్యవతి సూచించారు.

ads