కల్లు తాగిన మంత్రులు

జనగామ జిల్లా : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు కల్లు మండవ వద్దకు వెళ్లి కల్లుతాగారు.
శుక్రవారం జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పాల్గొనేందుకు వస్తున్నారు.

మార్గ మధ్యలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికుల సమస్యలను తెలుసుకుని సాంప్రదాయ తాటికల్లును పొద్దున్నే మంత్రులు సేవించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు.