జులై 1న టీఎస్ ఈ‎సెట్- 2021 పరీక్ష

హైదరాబాద్ : టీఎస్ ఈ‎సెట్- 2021 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. జులై 1న పరీక్ష నిర్వహణ. ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, ఈఈఈ స్ట్రీంలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అదే సీఐవీ, సీహెచ్ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరుగనుంది. రాష్ట్ర ఉన్నత విద్యామంలి తరపున జవహర్‎లాల్ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (జేఎన్‎టీయూహెచ్ ) ఈ పరీక్షేను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‎టీయూహెచ్‎కి ఇది ఏడోసారి. బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ ( మ్యాథమెటిక్స్ ) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 17న నోటిఫికేషన్ విడుదల కానుంది.

ads

అర్హులైన అభ్యర్థులు ఆన్‎లైన్ విధానంలో మార్చి 22 నుంచి మే 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుముతో మే 31 వరకు, రూ.5 అపరాద రుసుముతో జూన్ 14వరకు, రూ.2,500 అపరాద రుసుంతో జూన్ 24 వరకు అదే రూ.5వేల అపరాద రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400 కాగా,ఇతర అభ్యర్థులకు రూ.800 . పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://ecet.tsche.ac.inకు లాగినై తెలుసుకోవచ్చు.