ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ షెడ్యూల్‎ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మే 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 5, 6వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. ఎంసెట్‎లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 100 శాతం, సెకండియర్ నుంచి 70 శాతం సిలబస్ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతీ రోజు రెండు దశల్లో ఆన్‎లైన్ విధానంలో పరీక్ష జరుగనుంది.

ads