ఎర్రబెల్లిని కలిసిన ఉద్యోగ సంఘాలు

వరంగల్​ అర్బన్​ జిల్లా : ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యల సాధనతో పాటు, పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేసింది. దీంతో పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావును శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ సీఎం కేసీఆర్ ఆదేశాలతో దాదాపు అన్ని శాఖలలో పూర్తయ్యాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్​ విషయంలో మాట్లాడి ఒప్పించాలని మంత్రిని కోరారు. జిల్లాకు చెందిన ఉద్యోగుల వివిధ సమస్యలను మంత్రి ఎర్రబెల్లికి వివరించారు. వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీజీవో, టీఎన్జీవో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్స్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, కోలా రాజేష్ కుమార్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు జీ రాజకుమార్, రాష్ట్ర సహాధ్యక్షుడు రియాజుద్దీన్ . టీఎన్జీవో నాయకులు మాధవ రెడ్డి, సదానందం, మురళీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.