వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ భర్త

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త సౌందర రాజన్ కరోనా టీకా వేయించుకున్నారు. మొదటి విడుతలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే ఫ్రంట్ లైన్ వారియర్‎గా డాక్టర్ సౌందర రాజన్ కరోనా టీకా తీసుకున్నారు. అనంతరం కొవిడ్ టీకా తీసుకున్న తన భర్తను గవర్నర్ తమిళిసై అభినందించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అంతా టీకా వేయించుకోవాలని సూచించారు.