ప్రభుత్వం చర్చలకు రెడీ

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదివారం త్రిసభ్య కమిటీని ఆదేశించారు. వారం, పదిరోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎస్ కు సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సీఎస్ సోమేష్ కుమార్ , ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామక్రిష్ణారావు, రజత్ కుమార్ సోమవారం బీఆర్ కేఆర్ భవన్ లో సమావేశమయ్యారు. వేతన సవరణ నివేదిక, ఉద్యోగుల పదోన్నతులు, ఉద్యోగుల రిటైర్మెంట్, వయసు పొడిగింపు తదితర అంశాలపై చర్చించారు. వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు షెడ్యూల్ ను సైతం రూపొందించారు.