జూన్ 12న టీ పాలీసెట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( టీఎస్ పాలీసెట్ ) 2021 పరీక్ష జూన్ 12వ తేదీన జరుగనుంది. డిప్లొమా ఇన్ ఇంజనీర్ ( పాలిటెక్నిక్ ), అగ్రికల్చర్ , పశు సంవర్ధక, ఫిషరీస్ కోర్సులకు పాలీసెట్ నిర్వహణ. ఫలితాలను జూన్ 24న ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎస్ బీటీఈటీ శనివారం షెడ్యూల్ ను వెల్లడించింది. మే 1 నుంచి 22 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.