మినీ మేడారంకు టీఎస్ఆర్టీసీ సిద్ధం

ములుగు జిల్లా : మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 27 వరకు జరుగనుంది. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న మినీ మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ వరంగల్ రీజియన్ తరపున హన్మకొండ బస్ స్టాండ్ నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుటకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు వరంగల్ రీజినల్ మేనేజర్ ఎస్వి జికె మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం ఒక ఆర్టీసీ బస్సులతోనే సాధ్యమని ఆయన అన్నారు. కావున ప్రయాణికులు భక్తులు ఆర్టీసీ బస్సులలో మేడారం జాతరకు వెళ్లి అమ్మ వార్ల దీవెనలు పొందాలని భక్తులను కోరారు.

కరోనా లాంటి భయంకర వ్యాధులనుండి మనల్ని అమ్మవారు కాపాడాలని మనకు అంతా మంచే జరుగునట్లు చూడాలని ఆ అమ్మవార్లను కోరుకోవాలన్నారు. భక్తులు మేడారం జాతరకు అమ్మవార్ల గద్దెల వద్దకు నడిచే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే కనుక సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం ఒక్క ఆర్టీసీ తోనే సాధ్యమని తెలిపినారు. డివిజినల్ మేనేజర్ వరంగల్అర్బన్ శ్రీనివాస రావు మరియు డిపో మేనేజర్ వరంగల్ 2 మహేష్ పాల్గొన్నారు. మేడారం మినీ జాతర కౌంటర్‎ను హన్మకొండ బస్ స్టాండ్ నందు మరియు ములుగు Xరోడ్ కౌంటర్‎ను కూడా సందర్శించినారు.