ఘనంగా బీఆర్​ లెనిన్​ జన్మదిన వేడుకలు

వరంగల్ అర్బన్ : వరంగల్ ప్రెస్ క్లబ్ మరియు టీయూడబ్ల్యూజే (హెచ్​-143) ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే (హెచ్​-143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ 52 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం సుబేదారి మరియు బాల సముద్రం లోని ప్రెస్ క్లబ్ లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

సీనియర్ మరియు జూనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి నా పుట్టినరోజును ఒక పండుగలాగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని టీయూడబ్ల్యూజే (హెచ్​-143)  రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ ఆనందం వ్యక్తం చేశారు.

శ్రేయోభిలాషి లెనిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రెస్ క్లబ్ యూనియన్ తరుపున శుభాకాంక్షలు తెలుపుతూ లెనిన్  జీవితంలో మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి కోరారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న వరంగల్​ టైమ్స్​ ఎడిటర్​ మరియు చైర్ పర్సన్ నాగబెల్లి సోని ప్రత్యేకంగా బీఆర్​ లెనిన్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ బర్త్ డే వేడుకల్లో  ప్రెస్ క్లబ్ కార్యదర్శి పీ వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ కేసనపల్లి రంజిత్​కుమార్​, టీయూడబ్ల్యూజే( హెచ్​-143) అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకపు శుభాష్, ప్రచార కార్యదర్శి అంతడపుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు టి శ్రీనివాస్, బి శ్రీనివాస్, జనగామ జిల్లా అధ్యక్షుడు వెంకట్, బొడిగే శ్రీనివాస్, అమర్, దిలీప్, అంజి, తిరుమల్, నర్సయ్య, ఫోటో గ్రాఫర్స్ సుధాకర్, శ్యామ్, వెంకట్ కందికట్ల, అంజి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.