గన్ మిస్ ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్

విజయవాడ : విజయవాడ గొల్లపూడిలో భార్యను హత్య చేసి డ్రామా ప్లే చేసిన హోంగార్డు వినోద్ కుమార్ అసలు రంగు బయటపడింది. గన్ మిస్ ఫైర్ తో తన భార్య చనిపోయిందని గేమ్ ఆడాడు హోంగార్డు వినోద్. గన్ మిస్ ఫైర్ లోనే హోంగార్డు భార్య చనిపోయినట్లు అందరూ నమ్మారు. పోలీసుల దర్యాప్తులో మాత్రం షాకింగ్ ట్విస్ట్ తెలిసింది. హోంగార్డు వినోదే..భార్య రత్న ప్రభపై ఫైరింగ్ చేసి, చంపేసినట్లు పోలీసులు తేల్చారు. హోంగార్డు వినోద్ ఏఎస్పీ శశిభూషణ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.

ads

మూడు రోజుల కిందట అనంతపురం వెళ్లిన ఏఎస్పీ , తన గన్ ని హోంగార్డు దగ్గర పెట్టారు. ఆ తుపాకీని తన ఇంటికి తీసుకెళ్లాడు హోంగార్డు. గోల్డ్ తాకట్టు విషయంలో నాలుగు నెలలుగా భార్య, భర్తల మధ్య గొడవ నడుస్తోంది. రాత్రి మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. కోపంలో గన్ తో భార్యపై కాల్పులకు తెగబడ్డాడు. రత్న ప్రభ అక్కడికక్కడే చనిపోయింది. అయితే గన్ మిస్ ఫర్ లో భార్య చనిపోయిందని హోంగార్డు వినోద్ నమ్మించే ప్రయత్నం చేశాడు .