అతీంద్రియ శక్తుల కోసం దారుణం

చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులను కన్నతల్లే హత్య చేసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్​కు చెందిన ఎన్​. పురషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ ఉమెన్స్​ డిగ్రీ కాలేజీలో వైస్​ ప్రిన్సిపల్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య పద్మజ కూడా ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరికి అలేఖ్య(27),సాయి దివ్య(22) ఇద్దరు కూతళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు బోపాల్​లో పీజీ విద్యనభ్యసిస్తోంది. చిన్న కూతురు బీబీఏ పూర్తి చేసి రెహమాన్​ సంగీతం అకాడమీలో మ్యూజిక్​ నేర్చుకుంటోంది.

అయితే వీరంతా గత సంవత్సరం శివనగర్​ లో కొత్తగా కట్టుకున్న గృహంలోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా రాత్రి ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్న కూతురు సాయిదివ్యను శూలంతో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్​లో కొట్టి చంపారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేస్తున్న కాలేజీలో ఓ లెక్చరర్​కు చెప్పాడు. ఆయన వెంటనే పురుషోత్తం నాయుడు ఇంటికి చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ శ్రీనివాసులు ,ఎస్సైలు దిలీప్​కుమార్​, రమాదేవి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిం చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అయితే పద్మజ పురుషోత్తం దంపతులు బంధువులను కూడా ఇంట్లోకి రానివ్వలేదు. పురుషోత్తమ నాయుడు, పద్మజతెల్లారి ఇద్దరు బ్రతుకుతారు అప్పటి వరకు వేచి ఉండాలని పోలీసులకు చెబుతున్న తల్లి దండ్రులు