బైక్స్​ దొంగల అరెస్టు

హైదరాబాద్​ : నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీసీ మురళీధర్, ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

వారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చార్మినార్ కు చెందిన సోహెల్ అలీ అలియాస్ స్టాండపు మరియు మౌలాలీ కి చెందిన సయ్యద్ తాడెప్ ఇద్దరు మిత్రులు. గుట్కా గంజాయ్ మరియు వైట్నర్ లాంటి వాటికి అలవాటుపడ్డారు. అదే మత్తు లో ఇంటి ముందు పార్క్ చేసిన, రోడ్ల వెంట పార్క్ చేసిన వాహనాలను హ్యాండిల్ ను విరిచి వాహనాలను ఎత్తుకెళ్లే వారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నల్లకుంట పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొట్టేసిన వాహనం యమహా ఎఫ్​జెడ్​ పైన వస్తుండగా పోలీసులు ఆపారు. పత్రాలు లేకపోవడం, సరైన సమాధానం చెప్పకపోవడంతో విచారించగా కొట్టేసి నట్లు ఒప్పుకున్నారు. దీంతోపాటు అంతకు ముందు మరో ఆరు వాహనాలు, నల్లకుంట పరిధిలో లో ఒక పాన్ షాప్ లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. కొట్టేసిన ఆరు వాహనాలను నిందితుల ఇంటి వద్ద రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో వీరిద్దరూ మీరు చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను ఎత్తుకెళ్లి జైలు కి వెళ్లి వచ్చినట్లు తెలిపారు.

ఈ కేసును చేధించిన నల్లకుంట ఇన్​స్పెక్టర్​ మొగిలిచర్ల రవి ఆధ్వర్యంలో క్రైమ్ ఇన్​స్పెక్టర్​ కిషన్, సబ్ ఇన్​స్పెక్టర్ వెంకటేశ్వర్ల ను సిబ్బంది ని అడిషనల్ డీసీపీ మురళీధర్ ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు.