ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన గురువారం పెద్ద అంబర్​పేట ఔటర్​ రింగురోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ కు కొందరు ఇన్నోవా కారులో బయలుదేరారు. పెద్డ అంబర్ పేట్ సమీపంలో కి రాగానే వాహనాన్ని అక్కడ ఆపారు. కారులో నుంచి అందరూ దిగారు. అనంతరం కారు డ్రైవర్​ దిగే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం కారు డ్రైవర్​ను, ఆగి ఉన్నమరో డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్​, డీసీఎం డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.