యూజీ ఆయుష్‌‎లో వెబ్ కౌన్సిలింగ్

వరంగల్ అర్బన్ జిల్లా : యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండో విడుత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‎ను మంగళవారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), నేచురోపతి-యోగా(బీయూఎంఎస్) కోర్సుల్లో సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ నెల ఫిబ్రవరి10న ఉదయం 9 గంటల నుంచి 11న రాత్రి 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అయితే ఆలిండియా కోటాలో యూజీ ఆయుష్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులు అదే విధంగా కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులతో పాటు మొదటి విడతలో సీటు పొంది చేరని అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‎కు అనర్హులు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‎సైట్‎ www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.