యూపీఎస్సీ నోటిఫికేషన్

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యూపీఎస్సీ ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల ఫిబ్రవరి 11 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ , డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇందులో 241 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 116, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 80, అసిస్టెంట్ ప్రొఫెసర్ ( స్పెషల్ గ్రేట్ 3) 45, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 6, లెక్చరర్ 1, అసిస్టెంట్ డైరెక్టర్ 1 చొప్పున పోస్టులున్నాయి.

అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ , అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ , డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల వయసు 30 యేండ్లు కలిగి ఉండాలి. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ , లెక్చరర్ పోస్టులకు 35 యేండ్ల వయసు, గ్రేడు 3 పోస్టులకు 40 యేండ్ల వయసు లోపు కలిగినవారై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో