వకీల్ సాబ్ టీజర్

సంక్రాంతి పండుగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ సినిమా టీజన్ ను గురువారం విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వకీల్ సాబ్ చిత్రం రూపొందుతోంది. ‘కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది.

బాలీవుడ్ హిట్ సినిమా ‘పింక్’ రీమేక్ గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కించారు. ఇందులో పవన్ కల్యాణ్ న్యాయవాదిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్ కథానాయికగా, అంజలి, నివేదా, అనన్య నాగళ్ల కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దిల్ రాజు సినిమాను నిర్మించారు.