“వకీల్ సాబ్” మ్యూజికల్ ఫెస్ట్

హైదరాబాద్​ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రచార సందడి మొదలైంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రెస్టీజియస్ సినిమా. వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం ఒక అసెట్. కాగా ఇప్పటికే రిలీజైన మూడు పాటలు మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ గాయనీ గాయకులు హారిక నారాయణ, ఫృథ్వీ, దీపు, శ్రీ కృష్ణ, సాహితీ, సుభ తదితరులు పాల్గొన్నారు. వకీల్ సాబ్ చిత్రంలోని పాటలను లైవ్ లో ఫర్మార్మ్ చేశారు. ఈ పాటలను స్టూడెంట్స్ ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.

ads

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్​తో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. వకీల్ సాబ్ సినిమా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుంది. సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాం. రేపు థియేటర్లో మీకూ అదే అనుభూతి కలుగుతుందని నమ్ముతున్నాం. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా పవన్ నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వకీల్ సాబ్ కు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ కు థ్యాంక్స్​ . అలాగే పాటలకు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన రామ జోగయ్య శాస్త్రికి స్పెషల్ థాంక్స్’అన్నారు దర్శకుడు వేణు శ్రీరామ్​.

‘నేను పవన్ కళ్యాణ్​కు పెద్ద అభిమానిని. మణిశర్మ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఖుషి, గుడుంబా శంకర్, బాలు చిత్రాలకు పనిచేశాను. పవన్ కళ్యాణ్ తో సినిమా మ్యూజిక్ చేయడం నా డ్రీమ్. ఎప్పుడెప్పుడు ఆ అవకాశం వస్తుందా అని ఎదురుచూశాను. నా కల పవన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ చిత్రంతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. పాటలన్నీ సూపర్బ్ గా వచ్చాయి. రీరికార్డింగ్ సగం పూర్తయింది. రీరికార్టింగ్ టైమ్ లో సినిమా చూస్తున్నప్పుడే పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ సినిమాలో కనిపించింది. మాకే అలా అనిపిస్తే, రేపు థియేటర్​లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఈ అవకాశమిచ్చిన నిర్మాత దిల్ రాజుకు ,డైరెక్టర్ వేణు శ్రీరామ్​కు ధన్యవాదాలు. అన్ని పాటలకు మంచి రచన అందించిన రామజోగయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు.’అన్నారు. మ్యూజిక్​ డైరెక్టర్ థమన్​.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి

సంగీతం : ఎస్‌ఎస్‌ థమ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ : పీఎస్​ వినోద్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌ : రాజీవ‌న్‌
ఎడిటింగ్‌ : ప్ర‌వీణ్ పూడి,
డైలాగ్స్‌ : తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌
వీఎఫ్​ఎక్స్ : యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి,
స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌,
నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్
ద‌ర్శ‌క‌త్వం: వేణు శ్రీరామ్