పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి గెలుపు

 

ads

హైదరాబాద్ : మహబూబ్‎నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై వాణీదేవీ గెలుపొందారు. వాణీదేవికి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు 1,12,689 పోలవ్వగా, సెకండ్ ప్రయారిటీగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయ ఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి. రాంచందర్ రావు ఓటమితో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. వాణీదేవి గెలుపుతో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరిపాయి. ఈ సంబురాల్లో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపినాథ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇక హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి గెలుపుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వాణీదేవీ విజయంపై సౌతాఫ్రికా శాఖ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్ , సబితా ఇంద్రారెడ్డి వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ ,రంగారెడ్డి, మహబూబ్ నగర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ,కెసిఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసిన ఓటర్ లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.