ఆర్గానిక్ పంటలపై మొగ్గు చూపాలి

వరంగల్ అర్బన్ జిల్లా : చిరువ్యాపారులంతా ఆర్గానిక్ కూరగాయలు అమ్మడానికి మొగ్గు చూపాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ఎక్సైజ్ కాలనీలో గల రైతు బజార్ లో ఆర్గానిక్ కూరగాయల షాప్ ను శనివారం చీఫ్ విప్ ప్రారంభించారు. దాదాపు 130 ఎకరాల భూమిలో యజమాని కృష్ణమూర్తి సాగు చేస్తున్న ఆర్గానిక్ ఫాం కూరగాయలను కొనుగోలు చేసేందుకు రైతు బజార్‎లో షాప్‎ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది.

ఇట్టి ఆర్గానిక్ ఫాం కూరగాయల షాప్ ని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో కూరగాయల ధరలు ఉండేలా చూసుకోవాలని వ్యాపారులకు దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు. రైతులంతా ఆర్గానిక్ పంటలు పండించే దిశగా మొగ్గు చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, స్థానిక టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.