కథపై న‌మ్మ‌కంతోనే ‘మోసగాళ్లు’

కథపై న‌మ్మ‌కంతోనే `మోసగాళ్లు` చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో చేశాం : విష్ణు మంచు.

ads

హైదరాబాద్​: విష్ణు మంచు హీరోగా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 19న సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మీడియాతో చిట్​చాట్​ చేశారు.

సాధారణంగా సినిమా రిలీజ్‌ అయ్యే సమయంలో ఏ హీరో అయినా టెన్షన్‌ పడతాడు. టెన్షన్‌ లేదంటే మీరు నమ్మకండి. ప్రతి ఒక్కరికీ యాంగ్జయిటీ ఉంటుంది. నాకున్న మార్కెట్‌ వేల్యూ కన్నా ఎక్కువగా ఖర్చుపెట్టాను అని తెలిపారు హీరో మంచు విష్ణు.

కథపై నమ్మకంతో ఎలాంటి పేరా మీటర్స్‌ ఆలోచించకుండా ఖర్చు పెట్టి చేసిన సినిమా. నేను అమెరికా, లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లినప్పుడు ఈ సినిమాలో అనుకున్న విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ముంబై మీడియాలోనూ దీని గురించి ఎక్కువగా రాశారు. అమెరికాలో ఉన్నప్పుడు ఈ స్కామ్‌కు సంబంధించిన ఫోన్‌ కాల్‌ కూడా నాకు వచ్చింది. నేను మాట్లాడాను. ప్రకృతి ఈ పాయింట్‌తో సినిమా చేయమని చెబుతుందని నాకు అనిపించింది. అలా సినిమా స్టార్ట్‌ అయిందని హీరో మంచు విష్ణు అన్నారు.

హైదరాబాద్‌లోని ఓ బస్తీలో ఉండే అక్క, తమ్ముడు అమెరికాకు వెళ్లి అక్కడ వేల మంది కుటుంబాలను రోడ్డున పడేలా చేశారు. తెల్లవాళ్లు కదా, వాళ్ల దగ్గర డబ్బులుంటాయని వాళ్లు అనుకున్నారు. తెలివి తేటలతో మోసం చేసి డబ్బు సంపాదించి అటు అమెరికన్‌ ప్రభుత్వానికి , ఇటు ఇండియన్‌ ప్రభుత్వానికి దొరక్కుండా ఎలా తప్పించుకున్నారనేదే సినిమా కథాంశం అని మంచు విష్ణు చెప్పారు.

సినిమా కథ అనుకున్నప్పుడు ఆ అక్కా త‌మ్ముళ్ల‌ను క‌లుసుకోలేదు. కానీ మిగతా వారిని కలుసుకున్నాను. ముందు డ్రాఫ్ట్‌ తయారు చేసుకున్నప్పుడు కథలోని గ్యాప్‌ను బట్టి చాలా లిబర్టీ తీసుకున్నాను. అలాగే డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ వచ్చిన తర్వాత మరో డ్రాఫ్ట్‌ రెడీ అయింది. మన నెటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడానికి డైమండ్‌ రత్నబాబు హెల్ప్‌ తీసుకున్నాను. తొంభై శాతం నిజమైన కథ, పది శాతం లిబర్టీస్‌ తీసుకుని తయారు చేశామని హీరో మంచు విష్ణు పేర్కొన్నారు.

ఈ స్కామ్‌లో మెయిన్‌ వ్యక్తులు మన దేశానికి చెందినవారు. ఆయన పేరు చెప్పలేను కానీ. మన భారతదేశం పరువు పోకూడదని మన దేశం తరపున సిన్సియర్‌గా డ్యూటీ చేసిన పోలీస్‌ ఆఫీసర్‌ను ఈ సినిమా మేకింగ్‌ సందర్భంలో కలిశాను. ఓ టఫ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌ కాబట్టి ఎవరిని తీసుకోవాలని అనుకున్నప్పుడు సునీల్‌ శెట్టి ఆలోచనలోకి వచ్చారు. పాన్‌ ఇండియా సినిమా కాబట్టి అందరికీ ఆయన కనెక్ట్‌ అవుతారనినిపించింది. సాధారణంగా మనం ఇక్కడ ఎవరి జీవిత చరిత్రనైనా సినిమాగా చేసేయవచ్చు. మనకు ఎదురయ్యే సమస్యలు తక్కువగానే ఉంటాయేమో. కానీ ఈ సినిమా చేసే సమయంలో నాకు చాలా కొత్త విషయాలు తెలిసింది. ఓ ఆర్టికల్‌ను బేస్‌ చేసుకుని సినిమా తీయాలన్నా రైట్స్‌ తీసుకోవాలి. అలాగే స్కామ్‌లో మెయిన్‌గా ఉన్న అక్క, తమ్ముడు నాపై కేసు వేస్తే ఫేస్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. సినిమా కోసం ఇన్సురెన్స్‌ తీసుకోవాలి. ఈ సినిమా ఇన్సురెన్స్‌కే నా బడ్జెట్‌లో ఇరవై శాతం ఖర్చయింది. హాలీవుడ్‌లో సినిమా చేసే ముందు జరిగే ప్రీ ప్రొడక్షన్‌ చాలా ఫోకస్‌గా ఉంటుందని మంచు విష్ణు వివరించారు.

ఎక్కువ బడ్జెట్‌ పెట్టిన మూవీ. యూనివర్సల్‌ కథాంశం. ఇతర భాషల్లో విడుదల చేసుకోవడానికి స్కోప్‌ ఉందనిపించి పాన్‌ ఇండియా మూవీ మోసగాళ్లు సినిమా చేశాను. ఇండియన్‌ వెర్షన్‌ షూటింగ్‌ పూర్తయింది. ఇక ఇంగ్లిష్​ వెర్షన్‌ షూటింగ్‌ వారం, పది రోజులు పెండింగ్‌ ఉంది. కరోనా కారణంగా చేయలేకపోయాం. అక్కడి ఆర్టిస్టులు మే నెలలో డేట్స్‌ కేటాయించారని మంచు విష్ణు వెల్లడించారు.

ఓ స్టార్‌ హీరోయిన్‌, అందరికీ తెలిసిన హీరోయిన్‌ను నా అక్క పాత్రలో నటింప చేయాలని అనుకున్నప్పుడు ముందు ప్రీతి జింతాను కలిశాను. ఆవిడ కాస్త భయపడింది. తర్వాత ఇప్పుడున్న హీరోయినల్లో ఎవరు టాప్‌గా ఉంటారో ఆమెను అడుగుదాం అని అనుకున్నాను. అప్పుడు కాజల్‌ అగర్వాల్‌ ఐడియాకు రాగానే ఆమెను అడిగాను. కాజల్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకుని సినిమాలో నటించడానికి ఒప్పుకుందని మంచు విష్ణు తెలిపారు.

ప్రొడ్యూసర్‌గా మూడు సిరీస్‌లు చేయబోతున్నాను. వాటి వివరాలను ఏప్రిల్‌లో అనౌన్స్‌ చేస్తాను. ఢీ అండ్‌ ఢీ ఇప్పటికే స్టార్ట్‌ కావాలి. కానీ శ్రీను వైట్ల ఇంకా కథపైనే కూర్చుని ఉన్నారు. ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఆయన బలంగా అనుకుంటున్నారు. ఏప్రిల్‌ ద్వితీయార్థంలో సినిమా ప్రారంభం కావచ్చు. ఢీకి ఇది సీక్వెల్‌ కాదు. మరికొన్ని చిత్రాలు డిస్కషన్‌ స్టేజ్‌లోనే ఉన్నాయంటూ ఇంటర్వ్యూ ముగించారు విష్ణు మంచు.