సైకిల్ పై పోలింగ్ బూత్ కి వెళ్లిన విజయ్


చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్ పై పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేశాడు. చెన్నైలోని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వెళ్లి ఓటేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే విజయ్ స్టంట్ పొలిటికల్ కాంట్రవర్సీకి దారి తీసింది. ఇంధన ధరలను పెంచడానికి నిరసనగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైకిల్ పై వెళ్లాడని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై విజయ్ అధికార ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చాడు. విజయ్ రోడ్డు మార్గంలో సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు. విజయ్ ఇంటికి పోలింగ్ కేంద్రం దగ్గరుంది. అక్కడికి కారులో వెళ్తే పార్కింగ్ చేయడం కష్టంగా ఉండటం వల్ల సైకిల్ పై వెళ్లాడని తెలిపారు. విజయ్ సైకిల్ రైడ్ పై వివాదం సృష్టించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ టైం మొదలైందని మరోసారి వార్తలు రాగా, వాటిని కొట్టిపారేశాడు.

ads