మార్కెట్​లోకి విజయ ఐస్​క్రీం

హైదరాబాద్​ : నాంపల్లి లోని లలిత కళా తోరణంలో తెలంగాణ విజయ డెయిరీ నూతనంగా ఉత్పత్తి చేసిన విజయ ఐస్ క్రీమ్స్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.