బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. పంచాయతీలన్నీ బలవంతంగా ఏకగ్రీవం చేస్తారా అంటూ చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాలను పిలిపించి ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో కొన్ని నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్‎పై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశాడు. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్‎కు కూడా ఉత్తరాలు రాస్తాడు. ఈసారి కేంద్ర బలగాలు కాదు, అమెరికా సైన్యం, ఐకాస శాంతి దళం పంపాలని కోరతాడు. చివరకు చిత్తుగా ఓడింది టీడీపీ కాదు, ప్రజలే అంటూ తృప్తి పడతాడు.’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.