టెస్టుల్లో కోహ్లీ డకౌట్

చెన్నై: టెస్టు క్రికెట్‎లో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని డకౌట్ చేసిన తొలి స్పిన్నర్‎గా ఇంగ్లాండ్ బౌలర్ మెయిన్ అలీ అరుదైన రికార్డు సాధించాడు. శనివారం ఆరంభమైన ఇంగ్లాండ్‎తో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ కోహ్లీ(0) పరుగుల ఖాతా తెరువకుండానే పెవిలియన్ చేరాడు. టెస్టుల్లో విరాట్ డకౌట్ కావడం ఇది 11వ సారి. స్పిన్ బౌలింగ్‎లో డకౌట్ కావడం ఇదే మొదటి‎సారి.

తొలి సెషన్‎లో మెయిన్ అలీ వేసిన అద్భుత బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని వికెట్లను తాకింది. బౌల్డ్ కావడంతో ఆశ్చర్యానికి గురైన కోహ్లీ కొద్దిసేపు క్రీజులోనే ఉండిపోయారు. అంపైర్లు రీప్లేలో చూసి ఔట్‎గా ప్రకటించారు. జేమ్స్ ఆండర్సన్ , స్టువర్ట్ బ్రాడ్, పాట్ కమిన్స్ , బెన్ హిల్ఫెనాస్ , మిచెల్ స్టార్క్ , సురంగ లక్మల్, అబు జాయెద్, లియామ్ ఫ్లంకెట్ , రవి రాంపాల్, కీమర్ రోచ్ మొత్తం 10మంది కోహ్లీని టెస్టుల్లో సున్నాకే పెవిలియన్ పంపారు.