అనారోగ్యంతో సీఐ మృతి

హైదరాబాద్ : అనారోగ్యంతో హైదరాబాద్​ మలక్​పేట్​ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరంగల్ కు చెందిన సీఐ మల్లేశం ఆదివారం ఉదయం మృతిచెందారు. మల్లేశం 1982 బ్యాచ్ కు చెందిన వారు. వరంగల్​లోని మట్టెవాడ, కేయూ ఎస్సైగా విధులు నిర్వహించారు. కరీంనగర్​, కొడిమాల నుంచి ఎలక్సిటీ విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తుండగా రెండు నెలల క్రితం సీఐగా పదోన్నతి పొందారు. సీఐ మల్లేశం స్వగ్రామం వరంగల్​ రూరల్​ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం గ్రామం. ప్రస్తుతం ఆయన కుటుంబం రంగశాయిపేట్​లో నివాసం ఉంటుంది. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సీఐ మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.