మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజీనామా

ads

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసింది. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తనకు బాధ కల్గించిందని ఓ ప్రకటనలో తెలిపారు. అందుకే పూర్వపు మాజీ మేయర్ గా ఉన్న తాను టీపీసీసీ మెంబర్ మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తతం టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాస్పిటల్ లో ఉన్నందున వారు డిశ్చార్జై వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా వారిని కలిసి తన రాజీనామాను సమర్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తనతో ఉన్న కార్యకర్తలు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే నడుచుకోనున్నట్లు పేర్కొన్నారు.