ప్లాస్టిక్ రహిత నగరంగా వరంగల్

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బుధవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి కృతజ్ఞతతో పూలమాల వేశారు. అనంతరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ మహానగరంలోని పర్యావరణ పరిరక్షణ కమిటీ సదస్సులు ఏర్పాటు చేసి, ప్రతీ రోజు ప్రజలకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ఫలితంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోనే చారిత్రకమైన వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా గుర్తించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా రూ. 6 కోట్ల వ్యయంతో రీసైక్లింగ్ మిషన్ ఏర్పాటు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ads

నగరంలో మున్ముందు ప్లాస్టిక్ వాడకాన్ని జీరో లెవల్ తీసుకుని వెళ్లుటకు ఇంకా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ కి బదులుగా పేపర్, జ్యూట్ బ్యాగులు తయారీకి మహిళా సంఘాల సహాయంతో ఇప్పటికీ కొన్ని యూనిట్లు ఏర్పాటు చేయడమైనదని అన్నారు. నిరుద్యోగ యువతకు పేపర్, జూట్ బ్యాగుల తయారీ ఉపాధిని కల్పిస్తుందని అన్నారు. పేపర్, జ్యూట్ బ్యాగులు తయారీకి మరికొన్ని యూనిట్లు ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.