3రోజుల పాటు జర్నలిస్టుల నిరసన

వరంగల్ అర్బన్ జిల్లా : కేయూ క్యాంపస్‎లో రాజ్ న్యూస్ జర్నలిస్టుల మీద జరిగిన దాడిని టీయూడబ్ల్యూజే (హెచ్ 143), టీయూడబ్ల్యూజే( ఐజేయూ) మరియు వరంగల్ ప్రెస్ క్లబ్ సయుక్తంగా ఖండించింది. ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో టీఆర్ఎస్ బలపరిచిన వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారితీసింది. యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కొందరు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ ఇప్పటి వరకు నెరవేర్చిన హామీని తెలపాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కవరేజీ చేస్తున్న రాజ్ న్యూస్ జర్నలిస్టులపై టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు బైరపాక ప్రశాంత్ దాడి చేయడం తీవ్ర వివాదాస్పదానికి దారి తీసింది. దాడికి పాల్పడిన బాధిత రాజ్ న్యూస్ జర్నలిస్ట్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని జర్నలిస్టు యూనియన్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ దాడిని ఖండిస్తూ రేపటి ( మార్చి 9) నుంచి మార్చి 11 వరకు మూడు రోజుల పాటు ప్రతీ జర్నలిస్ట్ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెల్పాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.

ads

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్ 143) రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్, రాష్ట్ర నాయకులు మస్కపురి సుధాకర్, ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి గాడిపెళ్లి మధు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సుధీర్, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్ , జిల్లా నాయకులు అంతడుపుల శ్రీనివాస్, పొగాకు అశోక్, నవీన్, అరుణ్, కృష్ణమోహన్, రజిని, కిషోర్, వీడియో జర్నలిస్ట్ అధ్యక్ష కార్యదర్శులు తిరుమల్, అంజి, దిలీప్, బొడిగే శ్రీను, చందు, నర్సయ్య, సాల్మన్, నయీం, ప్రదీప్, రంజిత్, సాయి ప్రదీప్, ఫోటో జర్నలిస్టులు, జిల్లా బ్యూరోలు, స్టాఫర్లు, తదితరులు పాల్గొన్నారు.