రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

వరంగల్​ అర్బన్​ జిల్లా : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​రావు అన్నారు. శనివారం హన్మకొండ సుప్రభ హోటల్ లో ఓరుగల్లు సహాకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్​ జనరల్ బాడీ సమావేశాన్ని ఒడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ads

‘నాబార్డు రుణాలతో గోదాములు,పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకొని రైతు సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​రావు సూచించారు. నాబార్డు టెస్కాబ్​ సహకారంతో డీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

రాష్ట్రం లో సీఎం కేసీఆర్ 24 గం ఉచిత విద్యుత్, నీరు ఇవ్వడం వల్ల అనేక విధాలుగా వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని మార్నేని తెలిపారు. రైతులకు ఎరువులు విత్తనాలు అందించడం లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. చిరు వ్యాపారులకు, రైతులకు రుణాలు ఇవ్వడానికి చాలా సులభతరం చేశాం’అని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఒడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా డీసీవో నాగేశ్వర్ రావు, రూరల్ డీసీవో పరమేశ్వర్, డైరెక్టర్లు కే జనార్ధన్, నాగయ్య, వీ జనార్దన్, డీసీసీబీ డైరెక్టర్లు జగన్మోహన్​రావు,  గోపాల్ రావు, మురళీ, దొంగల రమేష్, ఎం రమేష్, మరియు పీఏసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.