వరంగల్‎టైమ్స్ డిజిటల్ ప్రసారాలు ప్రారంభం

వరంగల్ అర్బన్ జిల్లా : ప్రజల గొంతుకగా వరంగల్‎టైమ్స్ డిజిటల్ మీడియా ద్వారా ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు,జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రసారాలను వెబ్‎సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా వరంగల్ కేంద్రంగా ప్రసారాలను ప్రారంభించింది. వరంగల్ టైమ్స్ ఛానల్ లోగోను శనివారం సాయంత్రం 5.15ని.లకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ అర్బన్ జిల్లా బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. వార్తల సేకరణలో ముందుండి, ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రసారం చేయాలని లోగో ఆవిష్కరించిన సందర్భంగా అన్నారు. వరంగల్ టైమ్స్ ప్రజల గొంతుకగా నిలబడి, ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వాస్తవ వారధిగా నిలబడాలని దాస్యం వినయ్ బాస్కర్ కోరారు.

మీడియా రంగంలో తనకున్న అనుభవంతో పాటు సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చిన వరంగల్ టైమ్స్ ఎడిటర్, అండ్ సీఈవో సోని నాగబెల్లికి మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ టైమ్స్ ద్వారా మీడియాపై మక్కువ ఉన్న యువతకు అవకాశాలు కల్పించి, భవిష్యత్ రంగానికి వాస్తవ వార్తా సేకరణతో పాటు మంచి జర్నలిస్టులను సమాజానికి పరిచయం చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వెబ్‎సైట్ WWW.WARANGALTIMES.COMను సంప్రదించండి. ఇక తాజా వీడియోల కోసం యూట్యూబ్ లో WARANGALTIMES (WT)ను సబ్‎స్క్రైబ్ చేయండి.