హ్యాకర్లతో అప్రమత్తంగా ఉన్నాం

హైదరాబాద్​: చైనాకు చెందిన హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని విద్యుత్​ సీఎండీ ప్రభాకర్​రావు అన్నారు. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి యత్నిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించింది. అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకొని బ్లాకింగ్ సర్వర్స్, కంట్రోల్ ఫంక్షన్స్‌ని గమనిస్తూ ఉండాలని సీఈఆర్టీ సూచించింది. దీంత అందరి ఐడీలు , పాస్​వర్డ్​లు విద్యుత్​ శాఖ మార్చివేసింది.

ads