తీర్పును గౌరవిస్తున్నాం

అమ‌రావ‌తి : పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో సోమ‌వారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

‘ఎవరిపైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేంద్రం సలహా తీసుకుంటాం. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చివరి వరకూ పోరాడింది. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ రెండూ ఒకేసారి నిర్వహించడం కష్టం. ఎన్నికలు జరిపి తీరాలన్న ఎస్‌ఈసీ పట్టుదల వెనుక కుయుక్తులు ఉన్నాయి. ఎన్నికలకు వైసీపీ ఎప్పుడూ సిద్ధమే. ఎన్నికల నిర్వహణ ద్వారా కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. మాకు ఎలాంటి ఇగో సమస్యలు లేవు. ఎస్‌ఈసీ నిర్ణయం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ప్రజల కోసం చేసిన పోరాటంలో పరాజయం కూడా ఆనందమే’అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.