శ్రీ గంధం సాగుకు సహకారిస్తాం

ads

హైదరాబాద్​ : రాష్ట్రంలో శ్రీ గంధం సాగుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. రైతులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలిస్తామని సీఎస్​ హామీ ఇచ్చారు. నల్గొండ , రంగారెడ్డి జిల్లాల కు చెందిన రైతులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని బీఆర్​కేఆర్​ భవన్ లో కలిశారు. శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని, శ్రీ గంధం కలప ఉత్పత్తుల అమ్మకాలకు లైసెన్స్ లు , డీలర్ షిప్ లు ఇవ్వాలని అభ్యర్ధించారు. చందనం స్మగ్లర్ల నుంచి రక్షణ కల్పించాలని సీఎస్​ను కోరారు. రైతులు పేర్కొన్న అంశాలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సీఎస్​ హామీ ఇచ్చారు.

పంట సాగు చేసిన నల్గొండ జిల్లాకు చెందిన పీ ఇస్తారపు రెడ్డి, రంగారెడ్డి జిల్లా కు చెందిన కే రవీందర్ రెడ్డిని సీఎస్​ అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ గంధం సాగు ద్వారా పదిహేనేళ్ల వ్యవధిలో రూ. 36 లక్షలు లాభం అర్జించామని రైతులు సీఎస్​కు వివరించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హార్టీకల్చర్ డైరెక్టర్ వెంకట్రాం రెడ్డి అధికారులు పాల్గొన్నారు.