మద్య రహిత ఎన్నికలు నిర్వహిస్తాం

విజయనగరం జిల్లా: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను మద్య రహితంగా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ బీ రాజకుమారి అన్నారు. 2, 3, 4 విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలను మద్యరహితంగా నిర్వహించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు.
మద్యం, నాటు సారా అక్రమ తయారీ, రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎన్ఏబీ కంట్రోల్
ను ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కంట్రోల్ లో సమాచార సేకరణకు ఏర్పాటు చేసిన 08922-274865కు లేదా 9440902363కు మద్యం, నాటుసారా అక్రమ తయారీ, రవాణా సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరారు ఎస్పీ రాజకుమారి.

ఇందుకు సంబంధించి ఎస్ ఈబీ పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టర్​ను ఎస్పీ రాజకుమారి తన ఛాంబర్​లో ఆవిష్కరించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అక్రమార్కులపై దాడులు నిర్వహించి, ఎన్నికలను మద్యరహితంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకుగాను 6 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను, మరో 9 అంతరాష్ట్ర, అంతర జిల్లా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. వాహన తనిఖీల నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.

ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నందున నిరంతరం వాహన తనిఖీలను చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోడ్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా తరలించే వారిపై 56 కేసులు నమోదు చేసి 42 మందిని అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా, స్పెషల్ ఎన్‌ఫోర్స్​మెంట్​ బ్యూరో సిబ్బంది విస్తృతంగా దాడులు
నిర్వహించి 1222 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారన్నారు. 25, 830 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు చెప్పారు.

మన రాష్ట్రంలో జిల్లాకు చెందిన ఎస్ఈబీ పోలీసులే అత్యధికంగా నాటుసారా, మద్యం స్వాధీనం
చేసుకోవడం, 70వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. గతంలో మద్యం కేసుల్లో అరెస్టు కాబడిన 529 వ్యక్తులను బైండోవరు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఏ ఈబీ అదనపు ఎస్పీ ఎన్ శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ పీ సత్యన్నారాయణ రావు, ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, డీసీఆర్​ బీసీఐ బీ వెంకటరావు, ఎస్బీ సీఐ ఎన్ శ్రీనివాసరావు, ఎస్ ఈ బీ ఎస్ ఈ బీ ఎస్సై పీ పాపారావు పాల్గొన్నారు.