కొలువుదీరిన పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎం కేబినెట్ ను విస్తరించగా, సోమవారం 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతాలోని రాజ్ భవన్ లో కొత్త మంత్రులతో గవర్నర్ జగదీప్ ధన్ ఖర్ ప్రమాణం చేయించారు. 24 మంది కేబినెట్ మంత్రులుగా, పది మంది రాష్ట్ర మంత్రులు ( స్వతంత్ర), మరో తొమ్మిది మంది రాష్ట్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి మండలిలో చాలా మంది పాతమంత్రులు తమ బెర్తులను మళ్లీ దక్కించుకోగా, కొత్తగా బంకిమ్ చంద్ర హజ్రా, రతిన్ ఘోష్, పులక్ రాయ్, బిప్లబ్ మిత్రాను పదవులు వరించాయి.

ads

2011 నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న అమిత్ మిశ్రా సైతం కేబినెట్ లో చేరారు. ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో , రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు 6 నెలల సమయం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి హుమాయున్ కబీర్, రత్న దే నాగ్ సైతం మంత్రి ( స్వతంత్ర ) పదవులు వరించాయి. అలాగే రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ మనోజ్ తివారీ సైతం మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నాడు.