నందిగ్రామ్ లో ఆధిక్యంలో మమతా బెనర్జీ

నందిగ్రామ్ : పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో సీఎం టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 6వ రౌండ్ లో మమతా బెనర్జీ 1427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి 5 రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఒక్కసారిగా వెనుకంజలోకి వెళ్లిపోవడం గమనార్హం. 5వ రౌండ్ లోనే సువేందు ఆధిక్యం 9 వేల ఓట్ల నుంచి 3 వేలకు పడిపోయింది. ఇప్పుడు ఆ ఆధిక్యాన్ని ఆయన కోల్పోయారు.

ads