యూపీఐ పేమెంట్‌లో తప్పు జరిగితే..?
వరంగల్ టైమ్స్, information : యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు పొరపాటున వేరేవారికి డబ్బులు వెళితే కంగారు పడాల్సిన పని లేదు. ఎదుటివారి యూపీఐ ఐడీతో ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే నేరుగా మాట్లాడొచ్చు. గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్రముఖ యూపీఐ యాప్‌లన్నింటిలో సపోర్టు ఆప్షన్లు ఉంటాయి. ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్లి తప్పుడు లావాదేవీని ఎంచుకుని ‘రెయిజ్ ఎ డిస్ప్యూట్’ లేదా ‘రిపోర్ట్’ ఎంచుకోవాలి. లేదా www.npci.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసి డబ్బు తిరిగి పొందొచ్చు.