మార్చిలో ఆచార్య షూటింగ్​ ఎక్కడ?

ఖమ్మం జిల్లా : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ ఇల్లందు జేకే మైన్స్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఇల్లందు జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్ మరియు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో షూటింగ్ నిర్వహించనున్నారు. చిత్ర హీరో చిరంజీవి, రాంచరణ్ పై సన్నివేశాలు షూట్​ చేస్తారు. ఈ మేరకు అందుకు తగు అనుమతులు కల్పించాలని చిత్ర దర్శకుడు కొరటాల శివ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ను కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ చిత్ర షూటింగ్ కోసం స్థానికంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అలాగే హీరో చిరంజీవి కి తన నివాసంలో ఆతిథ్యం ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్​. మిగతా జిల్లాలతో పోల్చితే పర్యాటక రంగంగా ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి చెందిందని దర్శకుడు తెలిపారు. వివిధ చిత్రాల షూటింగ్ ల కోసం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అనువైన ప్రదేశమని పేర్కొన్నారు. గతం తో పోల్చితే ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని అందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అభినందనలు తెలిపారు దర్శకుడు కొరటాల శివ.