అడవి జంతువుల కట్టడి కమిటీ

హైదరాబాద్​: మనుషులు ‌‌-జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం (Human- Animal Conflict) తగ్గించే చర్యల సూచనకు ప్రభుత్వం కమిటీ నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ -11 జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్ గా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్. శోభ మెంబర్ కన్వీనర్ గా పదిమందితో కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు కేఆర్​ సురేశ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి, మాజీ శాసన సభ్యుడు జీ అరవింద్ రెడ్డి, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ), వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను నియమించింది.

ads

మనుషులను చంపుతున్న పులులు- సంబంధిత ఘటనలను తగ్గించేందుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే మనుషులు – వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం, ప్రస్తుత చర్యలు, నష్ట పరిహారంపై సమీక్షించనుంది. జంతువుల దాడుల్లో మనుషులు గాయపడటం, చనిపోవడం, పెంపుడు జంతువుల మృతి, పంట నష్టం చర్యలపై అధ్యయనం చేయనుంది. ఈ అంశాలన్నింటీపై మూడు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం కోరింది.