గవర్నర్ ఆమోదంతో కేసీఆర్ కు ఆరోగ్య శాఖ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఈటల రాజేందర్ పై భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి ఈటల నుంచి వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలపై కాసేపట్లో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. నేడు సాయంత్రం 5 గంటల వరకు ఈటల భూ కబ్జాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు తెలిపారు. అచ్చంపేట్, మాసాయిపేట గ్రామాలకు చెందిన కొంతమంది రూతులు తమ అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ అక్రమంగా లాక్కున్నారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ads

రైతుల ఫిర్యాదు మేరకు సీఎం కేసీఆర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఈటల హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు . మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అచ్చంపేట, మాసాయిపేటలో మెదక్ కలెక్టర్ హరీస్ విచారణ చేశారు. రైతుల నుంచి వివరాలను సేకరించారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తామని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.