ఘోర రోడ్డు ప్రమాదం..కూలీలు మృతి

వరంగల్ జిల్లా : వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండల కేంద్రం నుంచి ములుగు జిల్లాకు మిరపతోట ఏరడానికి కూలీలంతా కలిసి ఒక ఆటోలో ఉదయమే బయల్దేరారు. అయితే అటుగా వెళ్తున్న క్రమంలోనే నీరుకుళ్ల స్టేజి వద్ద తుఫాన్ వాహనం కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ads

ప్రమాదధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాను వాహనం ఆటోను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.