సీఎం కలల ప్రాజెక్ట్ యాదాద్రి: కేటీఆర్

హైదరాబాద్ : ఓ వైపు ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు వంటి ఆధునిక దేవాలయాలను నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ అదే సమయంలో ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక విశ్వనగరిగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయానికి సంబంధించిన వీడియోను కేటీఆర్ పంచుకున్నారు.

అణువణువునా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ నిర్మాణం జరుగుతోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునరుద్ధరణ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.