మానవత్వం చాటుకున్న యాకూబీచోటు

వరంగల్ రూరల్ జిల్లా : చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల వీరస్వామి-శోభ భార్యభర్తలు. వీరికి పిల్లలు లేరు,కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగించే వారు. కనీసం నివాసం ఉండటానికి ఇల్లు కూడా లేదు,ఆ అనే వాళ్ళు లేక శోభ గ్రామంలోని పలు ఇళ్లల్లో ఇంటి పని చేస్తూ భర్త వృద్ధాప్యంగా ఉండడంతో పూట గడవడం కష్టంగా మారింది. చెట్టు కింద ఉండి జీవనం సాగిస్తు ఉండగా గత రెండు సంవ్సరాలక్రితం అనగా 2019 జూన్ 3న ఓ దినపత్రికలో వీరి దీనగాథ ప్రచురణ చూసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్వఛ్చంద సేవకులు, గ్రామస్తులు హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని “సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ” నిర్వాహకురాలు యాకూబీచోటుకి సమాచారం అందివ్వగా వారు వెంటనే స్పందించి గ్రామానికి చేరుకొని ఆ వృద్ధ దంపతులను అక్కున చేర్చుకొని ఆశ్రమానికి తీసుకెళ్లడం జరిగింది.

ads

ఆశ్రమ నిర్వాహకులు గత రెండు సంత్సరాలుగా ఆ వృద్ధ దంపతులకు వారి ఆలన, పాలన, వారి బాగోగుల గూర్చి జాగ్రత్తలు తీసుకుంటూ చూసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఉదయం వీరస్వామి, వయస్సు 80 సం,,లు గుండెపోటు వచ్చి మరణించింది. నా అనే వారు లేకపోవడంతో బంధువులు కూడా రాకపోవడంతో సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు చోటు-యాకూబీ గార్లు దగ్గరుండి హిందూ సాంప్రదాయం ప్రకారం వీరస్వామి అంత్యక్రియలు నిర్వహించారు. స్వయంగా యాకూబీ గారు కుండ చేత పట్టి,చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరూ లేని వీరస్వామి అంత్యక్రియలు నిర్వహించినందుకు యాకూబీ-చోటు దంపతులను పలువురు అభినందించి ప్రశంసించారు.