యువకుడి అనుమానాస్పద మృతి

ములుగు జిల్లా: వెంకటాపురం మండలంలోని పాలెంవాగు జలాశయంలో యువకుడి మృతదేహం లభ్యమైంది. వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన పూసం యశ్వంత్ అనే యువకుడు నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ రోజు పాలెంవాగు జలాశయంలో శవమై తేలాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.