వైఎస్సార్ కడప జిల్లా : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి గ్రామ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే అభిష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుపుతున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వీరి మాటలు పట్టించుకోని నిమ్మగడ్డ రమేశ్ మాత్రం ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ తరుణంలో శనివారం వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటించారు. జిల్లాలోని ఒంటిమిట్టలోని కోదండరాముడి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే తన జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చిందని
తాను వైఎస్ఆర్ దగ్గర ఫైనాన్స్ సెక్రెటరీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ వల్లే తాను ఎన్నికల అధికారిని అయ్యానన్నారు నిమ్మగడ్డ . వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారన్నారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదన్నారు. ఆయన దగ్గర పని చేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదదన్నారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. వైఎస్సార్ వల్లే ఎస్ఈసీ ఆయ్యానని పరోక్షంగా సీఎం జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.