ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన

న్యూఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి బయల్దేరారు. రెండు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్‌ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, షెకావత్‌‌, జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను సీఎం కలిశారు. వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.

ads