గోగుల్లంక సర్పంచ్​ ఏకగ్రీవం

తూర్పుగోదావరి జిల్లా : జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొట్ట మొదటి ఏకగ్రీవ పంచాయతీగా ఐ పోలవరం మండలం గోగుల్లంక జీపీ నిలిచింది. ఏకగ్రీవంగా సర్పంచ్​ పదవికి శ్కాకర్లపూడి గీతాదేవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్సార్ సీపి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికైన అభ్యర్థిని సన్మానించారు. అభ్యర్థికి గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు అభినందనలు తెలిపారు.